: ఉగ్రవాదులపై మరోమారు ప్రేమ చూపిన పాక్.. సాక్ష్యాలు లేవని ముంబై దాడి ఉగ్రవాదిపై ఆరోపణలు కొట్టివేత

ఉగ్రవాదులపై తనకెంత ప్రేమ ఉందో పాకిస్థాన్ మరోమారు నిరూపించింది. సరైన సాక్ష్యాధారాలు లేవనే కారణంతో 26/11 ముంబై ఉగ్రదాడికి ఆర్థిక సాయం అందించిన సుఫియూన్ జాఫర్‌పై నమోదైన కేసును కొట్టివేసింది. ఉగ్రదాడికి ఫైనాన్షియర్‌గా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాఫర్‌కు సంబంధించిన చార్జిషీట్‌ను ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో ప్రవేశపెట్టింది. అతడికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేవని అందులో పేర్కొంటూ కేసును కొట్టివేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. నవంబరు 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడికి ఫైనాన్షియర్‌గా భావిస్తున్న జాఫర్‌ను గత నెలలో అదుపులోకి తీసుకున్నారు. జాఫర్ లష్కరే తోయిబాలో గతంలో పనిచేసినట్టు ఎఫ్ఐఏ డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. ముంబై ఉగ్రదాడికి సహకారమందించిన ఆయన అకౌంట్ నుంచి రూ.14,800 ట్రాన్స్‌ఫర్ అయినట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అయితే పూర్తి దర్యాప్తు అనంతరం అతడికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేవని ఎఫ్ఐఏ పేర్కొంటూ అతడిపై వచ్చిన ఆరోపణలను కొట్టివేసింది.

More Telugu News