: ఫ్రాన్స్‌లో ముగ్గురు మహిళా ఉగ్రవాదుల అరెస్ట్.. కాస్త ఆలస్యమై ఉంటే భారీ విధ్వంసమే!

కారులో గ్యాస్ సిలిండర్లు నింపుకుని, దాడికి సిద్ధంగా ఉన్న ముగ్గురు మహిళా ఉగ్రవాదులను ఫ్రాన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో ఓ పోలీస్ అధికారిపై దాడిచేసి కత్తితో పొడిచారు. పారిస్‌లోని నోట్రె డేమ్ కెథడ్రల్‌ వద్ద గ్యాస్ సిలిండర్లతో దాడికి సిద్ధంగా ఉన్న కారును స్వాధీనం చేసుకున్నట్టు ఫ్రాన్స్ అంతర్గత శాఖామంత్రి బెర్నార్డ్ కాజెన్యూవ్ తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. అరెస్ట్ సమయంలో పోలీస్ అధికారిపై మహిళలు కత్తితో దాడిచేసినట్టు పేర్కొన్నారు. మహిళల్లో ఒకరు కారు యజమానికి చెందిన 19 ఏళ్ల కుమార్తె ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. కారులో ఏడు సిలిండర్లు ఉండగా ఆరు పూర్తిగా గ్యాస్‌తో నింపి ఉన్నాయి. కారులో అరబిక్‌లో భాషలో ఉన్న కొన్ని పత్రాలు ఉన్నాయి. అరెస్టయిన ముగ్గురు మహిళల వయసు 39, 23, 19 ఏళ్లుగా పోలీసులు తెలిపారు. కారును సకాలంలో గుర్తించకుంటే భారీ విధ్వంసమే జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు. కారుతోపాటు తన కుమార్తె అదృశ్యమైందని కారు యజమానికి చెప్పడంతో పోలీసులు అతడిని విడిచిపెట్టారు.

More Telugu News