: సెంటిమెంట్ తో కాదు, నిధులతోనే అభివృద్ధి సాధ్యం: అరుణ్ జైట్లీ

‘సెంటిమెంట్ తో కాదు, నిధులతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఇక్కడి ప్రజల్లో సెంటిమెంట్ గా మారిందనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, సెంటిమెంట్ తో అభివృద్ధి సాధ్యం కాదు, అభివృద్ధి జరగాలంటే డబ్బులు ఉండాలని, అందుకే, కేంద్రం ప్యాకేజ్ ఇచ్చిందన్నారు. ఏపీ ప్యాకేజ్ కు కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదముద్ర వేస్తుందని, చట్టబద్ధత వచ్చాక అమలుకు ఢోకా ఉండదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని, హోదా సాధ్యం కానందునే ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారు. విదేశీ సంస్థల ద్వారా ఏపీ తీసుకునే రుణాలను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. దీనికి త్వరలో కేబినెట్ అనుమతి తీసుకుంటామన్నారు. ప్యాకేజ్ తో ఏపీకి చాలా లాభమని, చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కితాబిచ్చారు.

More Telugu News