: నిప్పులు చిమ్ముతూ.. నింగికెగసిన జీఎస్ఎల్వీ- ఎఫ్ 05

జీఎస్ఎల్వీ- ఎఫ్ 05 నింగికెగసింది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఇన్ శాట్ 3డీ ఆర్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ- ఎఫ్ 05 మోసుకెళ్తోంది. ప్రయోగం ప్రారంభమైన 45 సెకన్ల తర్వాత తొలిదశ విజయవంతం కాగా, ఆపై బూస్టర్ ఇంజన్ల సాయంతో జీఎస్ఎల్వీ- ఎఫ్ 05 దూసుకెళ్లింది. 135 సెకన్లకు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన రాకెట్ లో ఆపై మూడోదశ ఇంజన్ విజయవంతంగా ఆన్ కావడంతో శాస్త్రవేత్తలు కరతాళ ధ్వనులు చేశారు. కాగా, అంతకుముందు, జీఎస్ఎల్వీ ఎఫ్-05 లో సాంకేతిక లోపం తలెత్తింది. సేఫ్టీ రిలీవ్ వాల్వ్ తెరచుకోకపోవడంతో 40 నిమిషాలపాటు కౌంట్ డౌన్ నిలిచిపోయింది. బైపాస్ సిస్టం ద్వారా ఇంధనాన్ని నింపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించి, సమస్యను సరిదిద్దారు.

More Telugu News