: బంగ్లాదేశ్ టూర్ రిస్క్ అనుకుంటే చెప్పండి: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు

బంగ్లాదేశ్ టూర్ కు వెళ్లడం రిస్క్ అని అని తమ క్రికెటర్లు ఎవరైనా అనుకుంటే మూడు రోజుల్లోగా తమకు తెలియజేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పేర్కొంది. ముందస్తు సమాచారమిస్తే వారి స్థానే మరో క్రికెటర్ ను పంపుతామని పేర్కొంది. ఒకవేళ ఈ పర్యటనకు వెళ్లిన క్రికెటర్లు రాణిస్తే, వెళ్లని క్రికెటర్లకు రానున్న రోజుల్లో రిస్క్ తప్పదని ఈసీబీ జట్టు డైరైక్టర్ ఆండ్రూ స్ట్రాస్ హెచ్చరించారు. కాగా, బంగ్లాదేశ్ టూర్ కు సంబంధించి ఇటీవలే ఈసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జట్టు డైరెక్టర్ ఈ ప్రకటన చేశాడు. ఈ పర్యటనకు టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ తో పాటు, మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ లు ఇప్పటికే అంగీకారం తెలిపారు. అయితే, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు.

More Telugu News