: జీఎస్ఎల్వీఎఫ్-05లో సాంకేతిక లోపం.. ప్రయోగంపై కొనసాగుతున్న ఉత్కంఠ

జీఎస్ఎల్వీ ఎఫ్-05 లో సాంకేతిక లోపం తలెత్తింది. సేఫ్టీ రిలీవ్ వాల్వ్ తెరచుకోకపోవడంతో 40 నిమిషాలుగా కౌంట్ డౌన్ నిలిచిపోయింది. బైపాస్ సిస్టం ద్వారా ఇంధనాన్ని నింపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీంతో, జీఎస్ఎల్వీ ఎఫ్-05 ప్రయోగంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ రోజు సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీఎఫ్-05 )ను ప్రయోగించేందుకు నిన్న ఉదయం 11.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది. ఈ ఉపగ్రహం ద్వారా వాతావరణ అధ్యయనం చేయవచ్చు. ఇందులోని 6-ఛానల్ ఇమేజర్ ద్వారా భూమిపైన, సముద్రాలపైన జరిగే మార్పుల ఛాయా చిత్రాలు తీయవచ్చు.

More Telugu News