: చైనాలో తీవ్ర విమర్శలు చేసి, లావోస్ లో ఒబామాతో చేతులు కలిపిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు!

చైనాలో గతవారం జరిగిన జీ-20 సమావేశాల సమయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను తీవ్రంగా విమర్శించి, ఆయనతో భేటీకి దూరమైన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ, లావోస్ లో జరుగుతున్న సమావేశాల్లో చేతులు కలిపారు. ఒబామాను తిరుగుబోతుకు పుట్టిన వ్యక్తిగా అవమానకర వ్యాఖ్యలు చేసి, ఆపై చింతిస్తున్నట్టు ప్రకటించిన ఆయన, లావోస్ లో ఒబామాతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ కార్యదర్శి పెఫెక్టోయాసే మీడియాకు వివరిస్తూ, ఇరు దేశాల మధ్యా బలమైన సంబంధాలున్నాయని గుర్తు చేశారు. కాగా, తనను అవమానించిన డుటెర్టీని కలిసేందుకు చైనాలో అంగీకరించని ఒబామా, లావోస్ లో మాత్రం చర్చలకు ఓకే చెప్పడం గమనార్హం.

More Telugu News