: విమానం ఎక్కితే శాంసంగ్ నోట్ 7 ఫోన్ల వాడకంపై నిషేధం: క్వాంటాస్ ఎయిర్ లైన్స్ సంచలన నిర్ణయం

ప్రముఖ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ, ఆస్ట్రేలియాకు చెందిన 'క్వాంటాస్' సంచలన నిర్ణయం తీసుకుంది. శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలుతున్నాయన్న కారణాన్ని సాకుగా చూపుతూ, విమానాల్లో ఈ స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఫోన్లు కస్టమర్ల చేతుల్లో ఉండగా, వీటిల్లో దాదాపు 10 వరకూ పేలినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ విమానాలు ఎక్కే వారిదగ్గర నోట్ 7 ఫోన్లు ఉంటే వాటిని ఆన్ చేయడం లేదా చార్జింగ్ పెట్టడాన్ని నిషేధిస్తున్నట్టు క్వాంటాస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దేశవాళీ, ఇంటర్నేషనల్ రూట్లలోని అన్ని విమానాల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని అన్నారు.

More Telugu News