: ముద్దాయి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖే!... ‘ప్యాకేజీ’పై అడుగడుగునా కోర్రీలేసిన జైట్లీ శాఖ!

ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేలిపోయిన నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ అయినా భారీగా ఉంటుందన్న నవ్యాంధ్ర ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. నిన్న ఉదయం నుంచి ఢిల్లీలో వేగంగా చోటుచేసుకున్న పరిణామాలతో రాత్రి పొద్దు పోయే దాకా హైడ్రామా నెలకొంది. మధ్యాహ్నం 2.30 గంటలకే కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడుతుందని భావించినా... రాత్రి 11 గంటల దాకా వేచి చూడక తప్పలేదు. ఈ జాప్యానికి, అదే సమయంలో ఏపీకి ఆశించిన మేర ప్యాకేజీ లేకపోవడానికి కేవలం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొర్రీలే కారణమని తేలిపోయింది. ప్రతి విషయంలో అడ్డుపుల్లలు వేసిన ఆర్థిక శాఖ... ఏఏ పద్దుల కింద నిధులు విడుదల చేయాలి? అంతమేర విడుదల చేయడం సాధ్యమేనా? తదితర ప్రశ్నలతో అప్పటికే సిద్ధమైపోయిన డ్రాఫ్ట్ కాపీని అడుగడుగునా అడ్డుకుంది. ఈ క్రమంలో మధ్యాహ్నానికి రావాల్సిన ప్రకటన రాత్రి పొద్దుపోయాక గాని రాలేదు. అంతేకాకుండా అప్పటికే ఖరారైపోయిన పలు అంశాలను ఆర్థిక శాఖ కొర్రీల కారణంగా అరుణ్ జైట్లీ ప్రకటించలేకపోయారన్న వాదన కూడా వినిపిస్తోంది. వెరసి ప్రత్యేక ప్యాకేజీ పేరిట కేంద్రం నుంచి ప్రకటన విడుదలైనా... ఏపీ ప్రజలు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

More Telugu News