: చంద్రబాబుకు చేరిన ఏడు పేజీల ప్యాకేజీ డ్రాఫ్ట్... పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఢిల్లీ నుంచి ఏడు పేజీల ప్యాకేజీ డ్రాఫ్ట్ మెయిల్ అందింది. ఈ డ్రాఫ్ట్ లో కేంద్రం ఏఏ అంశాలు పొందుపరిచిందనే దానిపై మంత్రులు యనమల, నారాయణ, అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులతో కలిసి చర్చిస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, కేంద్రం ప్యాకేజీలో పొందుపరిచిన అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఏడు పేజీల మెయిల్ లో అంశాల వారీగా పొందుపరిచినట్టు తెలుస్తోంది. వాటిపై నేరుగా పీఎంవో అధికారులు, కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్యనాయుడుతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం దీనిపై పత్రికా ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రత్యేకప్యాకేజీపై రాత్రి ఏడు గంటల నుంచి చంద్రబాబుతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, పీఎంవో అధికారులు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన హైదరాబాదు రావాల్సి ఉందని, అయితే ప్యాకేజీ ప్రకటనను పరిశీలించిన తరువాతే ఆయన హైదరాబాదు చేరుకునే అవకాశం వుందని తెలుస్తోంది.

More Telugu News