: ఏపీకి ప్యాకేజీపై స్పందించిన అరుణ్‌జైట్లీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ఆర్థిక సాయం ఇచ్చేందుకు ఢిల్లీలో అరుణ్‌జైట్లీ ఆధ్వ‌ర్యంలో చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. విభ‌జ‌న హామీల అమ‌లుపై మ‌రోసారి జైట్లీతో కేంద్ర స‌హాయ మంత్రి సుజ‌నా చౌద‌రి భేటీ అయ్యారు. జైట్లీ కార్యాల‌యంలో ఈ భేటీ కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక సాయం అంశంపైనే చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు చెప్పారు. ఈ అంశంపై స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యానికి రాలేద‌ని అన్నారు. ఏపీకి సాయంపై వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని, వీలైతే ఈరోజు వ‌స్తుంద‌ని అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఇప్ప‌టికే రాష్ట్రానికి 25 విద్యాల‌యాలు ఇచ్చామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. హోదాకు స‌రితూగేలా ప్యాకేజీ ఇవ్వాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలిపారు.

More Telugu News