: పెట్రోలు దిగుమతే లేని దేశంగా ఇండియా: గడ్కరీ

ప్రస్తుతం ఏటా రూ. 4.5 లక్షల కోట్ల విలువైన క్రూడాయిల్ ను దిగుమతి చేసుకుంటున్న ఇండియా, ప్రత్యామ్నాయ వనరులపై దృష్టిని సారించిన విషయాన్ని గుర్తు చేస్తూ, త్వరలోనే ముడి చమురు దిగుమతి అన్న మాటే వినిపించని దేశంగా ఇండియా మారనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో మిథనాల్ వినియోగంపై నిర్వహించిన సదస్సులో గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. మూడు నాలుగేళ్ల క్రితం వరకూ రూ. 7.54 లక్షల కోట్ల విలువైన ముడి చమురును ఇండియా దిగుమతి చేసుకుంటోందని గుర్తు చేసిన ఆయన, ఎథనాల్, మిథనాల్, బయో సీఎన్జీ తదితర ప్రత్యామ్నాయ ఇంధనాలకు తమ ప్రభుత్వం మరింత ప్రోత్సాహమిస్తుందని తెలిపారు. దీనివల్ల వ్యవసాయ, గ్రామీణ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గడ్కరీ అభిప్రాయపడ్డారు.

More Telugu News