: చంద్రబాబు పట్టుతో ప్యాకేజీ చర్చల్లో ప్రతిష్టంభన!

ఈ ఉదయం నుంచి అరుణ్ జైట్లీతో తెలుగుదేశం నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు జరుపుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్టు తెలుస్తోంది. ఏపీకి హోదా బదులు అభివృద్ధి ప్యాకేజీని పూర్తిగా తయారు చేసి, మరికాసేపట్లో మీడియా ముందు పెట్టాలన్న ఆలోచనలో ఉన్న వేళ, ప్యాకేజీ తనకు సమ్మతం కాదని, హోదా ఇవ్వకుండా మరేమిచ్చినా ప్రజలు అంగీకరించరని చంద్రబాబు తేల్చి చెప్పడంతో సుదీర్ఘ కసరత్తు మధ్యలోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది. ప్యాకేజీపై చంద్రబాబుతో స్వయంగా మాట్లాడాలని నిర్ణయించుకున్న జైట్లీ, వెంకయ్య నాయుడు ఫోన్ చేసి ఢిల్లీకి ఆహ్వానించినప్పటికీ, ఆ విషయమై చంద్రబాబు నుంచి ఇంకా సమాధానం రాలేదు. ప్యాకేజీలోని అంశాల గురించి తెలుసుకున్న తరువాతనే ఢిల్లీకి వెళ్లాలా? వద్దా? అన్న విషయాన్ని సహచర మంత్రులతో చర్చించి నిర్ణయించాలని బాబు భావిస్తున్నారు. హోదా కోసం చంద్రబాబు పట్టుబట్టడంతో బీజేపీ పెద్దలు ఆయన్ను సమాధానపరిచేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

More Telugu News