: ఆండ్రాయిడ్ ఓఎస్ 7.0 'నోగట్'తో వచ్చేసిన తొలి స్మార్ట్ ఫోన్

గూగుల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 7.0 'నోగట్' (పంచదారతో తయారు చేసే భారతీయ మిఠాయి)తో తొలి స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఎల్జీ సంస్థ 'నోగట్'తో పనిచేసే స్మార్ట్ ఫోన్ వీ 20ని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన మెగా ఈవెంట్ లో ఆవిష్కరించింది. డ్యూయల్ డిస్ ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ లో 32 బిడ్ హై-ఫై క్వాడ్ డాక్ ఫీచర్ ను జోడించగా, ఈ ఫీచర్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ తమదేనని ఎల్జీ ప్రకటించింది. 5.7 అంగుళాల క్యూహెచ్డీ ప్రధాన డిస్ ప్లే, సెకండరీ డిస్ ప్లే, 4 జీబీ ర్యామ్, 63 జీబీ స్టోరేజ్, 2 టెర్రాబైట్ల వరకూ ఎస్డీ కార్డు సాయంతో విస్తరణ, 16/8 ఎంపీ కెమెరాలు, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీలతో మూడు రకాల రంగుల్లో లభ్యమవుతుందని సంస్థ పేర్కొంది. కాగా, నెక్సస్ బ్రాండ్లలోని ఫోన్లను ఆండ్రాయిడ్ 'నోగట్' ఓఎస్ కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చని ఇప్పటికే గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News