: ఏపీకి ‘హోదా’ లేదు!... నేడు ‘ప్యాకేజీ’ని ప్రకటించనున్న కేంద్రం!

రాష్ట్ర విభజనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా రాదట. ఈ మేరకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని కమిటీ నివేదికను సాకుగా చూపిన కేంద్రం... ప్రత్యేక హోదాకు చెక్ పెట్టేసింది. అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు నరేంద్ర మోదీ సర్కారు కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. ప్రత్యేక హోదాతో ఏఏ ప్రయోజనాలు అందుతాయో... వాటన్నిటితో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్రం నుంచి ఓ కీలక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈ ప్రకటనను విడుదల చేయనున్నట్లు, ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో ఉన్న జైట్లీ కార్యాలయం ఈ ప్రకటన విడుదలకు వేదిక కానున్నట్టు సమాచారం.

More Telugu News