: ‘పాక్ జిందాబాద్’ అనే వారితో చర్చలు వద్దే వద్దు.. రాజ్‌నాథ్‌కు తెగేసి చెప్పిన ముస్లిం పెద్దలు

‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినదించే వారితో చర్చలు జరపడం శుద్ధ దండగ అని ముస్లిం మతపెద్దలు అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ముస్లిం మతపెద్దల బృందం మంగళవారం హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘పాక్ జిందాబాద్’ అనే వారితో చర్చలు జరపడం ఎందుకని రాజ్‌నాథ్‌తో అన్నారు. ‘‘వేర్పాటువాదులను కలిసి మాట్లాడేందుకు హోంమంత్రితో వెళ్లినవారిని కలిసేందుకు వారు నిరాకరించారు. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తున్న వారితో చర్చలు ఎలా జరుపుతాం? మేం వారివద్దకు వెళ్లే ప్రసక్తే లేదు’’ అని గరీబ్ నవాజ్ ఫౌండేషన్‌కు చెందిన మౌలానా అన్సార్ రజా పేర్కొన్నారు. కశ్మీర్‌ సమస్యను పరిష్కరించేందుకు ఆదివారం హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పలు పార్టీల ప్రతినిధుల బృందం కశ్మీర్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వేర్పాటువాదులు వీరిని కలిసేందుకు నిరాకరించారు. అంతేకాక పాక్ జిందాబాద్ అంటూ నినదించిన సంగతి తెలిసిందే. వేర్పాటువాదుల తీరుపై రాజ్‌నాథ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రిని కలిసిన ముస్లిం మతపెద్దలు పై వ్యాఖ్యలు చేశారు.

More Telugu News