: కాశ్మీర్ పై వ్యూహమెలా?... గంట పాటు మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన రాజ్ నాథ్ సింగ్

జమ్మూ కాశ్మీర్ లో అఖిలపక్ష బృందం పర్యటన విఫలమైన వేళ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చలు జరిపారు. తన రెండు రోజుల జమ్మూ కాశ్మీర్ పర్యటన గురించి వివరించిన రాజ్ నాథ్, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానికి తన ఆలోచనను వివరించినట్టు సమాచారం. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆది, సోమ వారాల్లో కాశ్మీర్ లో పర్యటించి వచ్చిన ఆయన ప్రధానికి తెలిపారు. వియత్నాం, చైనా పర్యటనలను ముగించుకుని గత రాత్రి న్యూఢిల్లీకి ప్రధాని తిరిగి రాగా, ఈ ఉదయమే రాజ్ నాథ్ ను పిలిపించుకున్న ఆయన, కాశ్మీర్ లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హురియత్ నేతలు ప్రజాస్వామ్యానికి, మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వైఖరిని రాజ్ నాథ్ తెలియజెప్పగా, ప్రధాని వారిపట్ల అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.

More Telugu News