: విదేశాలకు పంపిస్తే తిరిగి వస్తారన్న నమ్మకమేంటి?... ఎస్సార్ గ్రూప్ రవి రూయా అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

తాను అమెరికా, కెనడా, సౌదీ అరేబియా దేశాల్లో పర్యటించేందుకు అనుమతించాలన్న ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్ రవి రూయా అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేమని 2002 నాటి 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న రూయాకు తేల్చి చెప్పింది. గతంలో ఓ పారిశ్రామికవేత్తను ఇలాగే అనుమతిస్తే తిరిగి రాలేదని గుర్తు చేసింది. అంతకుముందు రవి రూయా పిటిషన్ ను తిరస్కరించిన సీబీఐ, ఆయన ప్రవాస భారతీయుడని గుర్తు చేస్తూ, ఆయన రాకుంటే తిరిగి ఇండియాకు తీసుకురాలేమని తేల్చి చెప్పింది. న్యాయమూర్తి సైతం ఈ వాదనకు అంగీకరిస్తూ, ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఆయన విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. కాగా, గత సంవత్సరం రూయాను రష్యా, యూకే, ఫ్రాన్స్ పర్యటనలకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.

More Telugu News