: భారతీయుడి బిడ్డ ప్రియాంకకు 'మిస్ జపాన్' కిరీటం... ఎలా ఇస్తారంటూ జపాన్ ప్రజల నిరసనలు!

ఓ భారతీయుడు, మరో జపాన్ మహిళ దంపతులకు టోక్యోలో పుట్టి పెరిగిన ప్రియాంకా యోషికవా ఈ ఏడాది జపాన్ అత్యంత అందగత్తెగా గుర్తింపునిస్తూ, 'మిస్ జపాన్' కిరీటం ప్రకటించడాన్ని పలువురు జపాన్ వాసులు తీవ్రంగా విభేదిస్తున్నారు. గత సంవత్సరం నల్లజాతి వారసురాలైన అరియానా మియామోటో ఇదే కిరీటాన్ని దక్కించుకోగా, ఆమె హాఫ్ జపాన్ వాసంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇక అరియానాను ఆదర్శంగా తీసుకున్న ప్రియాంక ఈ సంవత్సరం కిరీటాన్ని ఎగరేసుకుపోవడంపై జపనీయులు జాత్యహంకార పూరిత వ్యాఖ్యలు చేశారు. వృత్తిరీత్యా కిక్ బాక్సర్ అయిన ప్రియాంక, జపాన్ లో బహుళ జాతి వారసత్వం ఉన్న అమ్మాయిలు ఎంతో వివక్షకు గురవుతున్నారని, వారికి న్యాయం చేసి, సమాన హక్కులను కల్పించేందుకు పోరాడుతానని అంటోంది. తన తండ్రిది కోల్ కతా అని, స్వాతంత్ర్య పోరాటం సాగుతున్న వేళ, తన తాతయ్య, మహాత్మాగాంధీకి రెండు రోజుల ఆతిథ్యం ఇచ్చారని గుర్తు చేసుకుంటోందీ జపాన్ అందాల బొమ్మ.

More Telugu News