: ‘స్థానిక’ పోరుపై జగన్ దృష్టి!... కార్పొరేషన్లు, మునిసిపాలిటీ ఎన్నికలపై సమీక్ష!

ఏపీలో ఇప్పుడప్పుడే ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. గడచిన ఎన్నికల్లో టీడీపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సంపూర్ణ మెజారిటీ రాగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనులయ్యారు. ఇక మరో రెండున్నరేళ్లు గడిస్తే కాని ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ఈ క్రమంలో నేటి ఉదయం వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీకి చెందిన ముఖ్య నేతలను పిలిపించుకుని భేటీ అయ్యారు. రాష్ట్రంలో 7 నగరపాలక సంస్థలు, 5 పురపాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా సన్నాహాలు పూర్తి చేసింది. రానున్న ఒకటి, రెండు నెలల్లో ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాన్ని రూపొందించేందుకే జగన్... తన పార్టీ ముఖ్యులతో భేటీ అయినట్లు సమాచారం.

More Telugu News