: హీరోయిన్ పేరుతో సమస్య... రష్యాలో ఆగిపోయిన హాలీవుడ్ సినిమా ప్రచారం!

హీరోయిన్ ఇంటిపేరు కారణంగా రష్యాలో ఓ హాలీవుడ్ సినిమా ప్రమోషన్ ఆగిపోయింది. 'బ్యాడ్ మామ్స్' సినిమాను రష్యాలో సెప్టెంబర్ ఒకటిన విడుదల చేశారు. అందులో భాగంగా ప్రచార చిత్రాలు రూపొందించారు. మిలా కునీస్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. దాంతో 'డు యూ వాంట్ కునిస్?' అనే ప్రశ్న ప్రతి ప్రచార చిత్రంలోనూ, హోర్డింగ్ లోనూ ఉంది. 'కునిస్' అనే పదానికి రష్యన్ భాషలో పెడార్థం వస్తుంది. అది లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన పదం కావడంతో ఆ పదాన్ని వినియోగించేందుకు ఈ సినిమా ప్రమోషన్స్ చూస్తున్న యాడ్ ఏజెన్సీ నిరాకరించింది. దీనిపై సెయింట్ పీటర్స్ బర్గ్ కు చెందిన చట్ట సభ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈ వివాదంపై మాట్లాడేందుకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వోల్గా సంస్థ నిరాకరించింది. ఈ సినిమాలో శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ రష్యా ఛానెళ్లన్నీ వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయడం ఆపేశాయి.

More Telugu News