: చైనాకు అమెరికా ఘాటు సూచన.. అంతర్జాతీయ నియమ నిబంధనలను పాటించాలని హితవు!

అంతర్జాతీయ నిబంధనలను బేఖాతరు చేస్తున్న చైనాకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఘాటు సమాధానం చెప్పారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన బరాక్ ఒబామా ఆ దేశానికి ఘాటు సూచన చేసినట్టు సీఎన్ఎన్ ఛానెల్ చేసిన ఇంటర్వ్యూలో తెలిపారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశమైన సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ, అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడంలో తనను తాను నిగ్రహించుకోవడం కూడా ఉందని అన్నారు. అంతర్జాతీయ నియమ నిబంధనలు రూపొందించుకున్నది వాటిని కచ్చితంగా అనుసరించాలని కాదు. అయితే వాటిని ఆచరించడం ద్వారా దీర్ఘకాలిక అంతర్జాతీయ బంధాన్ని బలపరచుకోగలమన్న సంగతి మనకు తెలుసని అన్నారు. ఇది కేవలం మన స్వప్రయోజనాల కోసమేనని, ఇలా ఉండడం చైనా ప్రయోజనాలకు దీర్ఘకాలికంగా ఉపయోగం ఉంటుందని తాను భావిస్తున్నానని ఒబామా తెలిపారు. దక్షిణ చైనా సముద్రం వంటి కొన్ని అంశాల్లో నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆర్థిక విధానాలలో కూడా వారి విధానాలు ఇలాగే ఉన్నాయని, ఇలా ఉండడం వల్ల చైనా దీర్ఘకాల ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని వారికి స్పష్టం చేశామని ఆయన చెప్పారు. వాణిజ్యం విషయంలో ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండకూడదని లేదని, అయితే రెండు దేశాలను వేధిస్తున్న అంతర్జాతీయ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తే ఆ దేశంతో స్నేహపూర్వకంగా కొనసాగడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.

More Telugu News