: పోలీసులు షాక్... పావురంతో రాయబారం, జైలు నుంచే సెటిల్ మెంట్లు!

తూర్పు కొలంబియాలోని కాంబిటా జైలులోని అధికారులు ఖైదీలు జైలు నుంచి చేస్తున్న సెటిల్ మెంట్ల గురించి తెలుసుకుని షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే... కాంబిటా జైలులో ఖైదీలు కఠినమైన శిక్షలు అనుభవిస్తున్నారు. వారిలో సుదీర్ఘ కాలం జైలులో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారిందర్నీ అధికారులు ఓ కంట కనిపెడుతూ సెక్యూరిటీ ఏర్పాట్లు చూస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ పావురం వచ్చి అక్కడి గోడపై వాలింది. ఆ పావురం కాస్త భిన్నంగా ఉండడంతో అనుమానం వచ్చిన అధికారులు మరింత పరిశీలనగా చూడగా, దాని వీపుకి ఓ పర్సు కట్టేసి ఉంది. అదేంటా? అన్న కుతూహలంతో ఆ పావురాన్ని పట్టుకుని దాని వీపుకున్న పర్సు తీసి చూడగా, అందులో ఓ కండోమ్ ప్యాకెట్ కనిపించింది. అందులో ఏదో ఉన్నట్టనిపించి దానిని ఓపెన్ చేసి చూడగా, అందులో పరిమాణంలో చిన్నదైన అత్యాధునిక మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ కనిపించాయి. దీంతో షాక్ తిన్న జైలు అధికారులు వాటిని తీసుకుని అందులో ఏమున్నాయో తెలుసుకుని షాక్ తిన్నారు. దీంతో జైలు నుంచే ఖైదీలు సెటిల్ మెంట్లు చేస్తున్నారని నిర్ధారించుకున్నారు. దీంతో ఈ మొబైల్, పెన్ డ్రైవ్ ఎవరివి? అనే విషయాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News