: భూమికి వేల అడుగుల ఎత్తులో, నేలను చూస్తూ విందారగించాలనుందా?... అయితే చైనాకు వెళ్లాల్సిందే!

భూమికి వేల అడుగుల ఎత్తులో నేలను చూస్తూ విందారగించాలనుందా? అయితే చైనా వెళ్లాల్సిందే. అందమైన గాజు వంతెనలకు చైనా ప్రసిద్ధి అన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత పొడవైన గాజు వంతెనను నిర్మించి ప్రసిద్ధి గాంచిన చైనా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఘనతను తన కీర్తికిరీటంలో పొదుగుకుంది. భూమికి అత్యంత ఎత్తున నిర్మించిన గాజు వంతనపై రెస్టారెంట్ ఏర్పాటు చేసింది. భూమికి 300 మీటర్ల (984 అడుగుల) ఎత్తులో కూర్చుని కిందనున్న భూమిని చూస్తూ నచ్చిన వంటకం ఆరగించవచ్చని చైనా పర్యాటక శాఖ చెబుతోంది. గాజు వంతెనలు చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుండడంతో, వారికి మరిన్ని సౌకర్యాలు, అనుభూతులు కల్పించడంలో భాగంగా ఈ రెస్టారెంటును ఏర్పాటు చేసినట్టు చైనా పర్యాటక శాఖ చెబుతోంది. దీంతో దీనిని ఆస్వాదిస్తూ పర్యాటకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

More Telugu News