: సంఘ్ తో గాడ్సేకు లింకుల ఆధారాల కోసం కపిల్ సిబల్ యత్నాలు!... ఆరెస్సెస్ నేతల క్రాస్ ఎగ్జామినేషన్ కు అభ్యర్థన!

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో సంబంధాలున్న వ్యక్తులే మహాత్మా గాంధీని హత్య చేశారన్న వ్యాఖ్యలపై వెనక్కు తగ్గని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు విచారణను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో రాహుల్ గాంధీని కాపాడుకునేందుకు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పెద్ద పోరాటమే మొదలుపెట్టారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేకు ఆరెస్సెస్ తో లింకుల కోసం ఆయన అన్వేషణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టు ముందు ఓ వినతిని ప్రతిపాదించారు. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఆరెస్సెస్ మహారాష్ట్ర విభాగానికి చెందిన నేత రాజేశ్ కుంతేను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అనుమతించాలని ఆయన కోర్టును విన్నవించారు.

More Telugu News