: సెన్సార్ బోర్డుపై చిందులు తొక్కిన రాఖీ సావంత్... సెన్సార్ బోర్డు అధ్యక్ష స్థానంలో కూర్చుంటానని సవాల్

బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ కు సెన్సార్ బోర్డుపై కోపం వచ్చింది. తాను నటించిన 'ఏక్ కహానీ జూలీ కీ' సినిమాకి సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ ఇవ్వడంపై చిందులు తొక్కింది. సెన్సార్ బోర్డులో ఏమీ తెలియని వారున్నారని మండిపడింది. తానేమీ 'పోర్న్ స్టార్' ను కాదని మండిపడింది. తాను ఈ దేశం బిడ్డనని, బాలీవుడ్ స్టార్ నని, తన సినిమాకు A సర్టిఫికేట్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. పెద్ద నిర్మాతల నుంచి డబ్బులు తీసుకోవడం మినహా సెన్సార్ బోర్డు చేసేపని ఏమీ లేదని తెలిపింది. తక్షణం సెన్సార్ బోర్డును మూసేయాలని డిమాండ్ చేసింది. లేదా సెన్సార్ బోర్డు అధ్యక్షుడు పహ్లాజ్ నిహ్లానీని తొలగించి, తనను ఆ స్థానంలో కూర్చోబెట్టాలని సూచించింది. ఆయన కంటే తాను సమర్థవంతంగా పని చేయగలనని తెలిపింది. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు లేవని, దానిపై బాంబే హైకోర్టులో పోరాడుతానని రాఖీ సావంత్ తెలిపింది.

More Telugu News