: చిరంజీవికి నేను అభిమానినే... ఇప్పుడు మాత్రం ఆయన నచ్చట్లా: కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ

ఓ సినీ హీరోగా చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని, తాను ఆయన అభిమానినని చెప్పిన ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ, చిరంజీవి తీరు ఇప్పుడు మాత్రం తనకు నచ్చడం లేదని అన్నారు. ఆయన వ్యవహార శైలితో కాపుల్లోని ప్రతి ఒక్కరికీ బాధ కలుగుతోందని విమర్శించారు. కాపుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు చూస్తే, కాపు జాతి ఆగ్రహాన్ని చిరంజీవి చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్ జగన్ పన్నిన కుట్రలో కొంతమంది చిక్కుకుని చంద్రబాబును విమర్శిస్తుంటే, వారిలో చిరంజీవి చేరాడని, ఇది ఎంతవరకూ సమంజసమో ఆయనే ఆలోచించుకోవాలని అన్నారు.

More Telugu News