: ఇళ్లు కొనేవారు కరవు... రూ. 6 లక్షల కోట్ల విలువైన గృహాలను విక్రయించుకోలేక డెవలపర్ల అవస్థ

తాము అభివృద్ధి చేసిన గృహాలను కొనుగోలు చేసేవారు కరవయ్యారని నిర్మాణ రంగ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో డెవలప్ మెంట్ పూర్తయిన తరువాత కూడా విక్రయించబడని ఆస్తుల మొత్తం పదేళ్ల గరిష్ఠానికి చేరింది. మొత్తం 1200 కోట్ల చదరపు అడుగుల్లో డెవలప్ చేసిన రూ. 6 లక్షల కోట్ల విలువైన గృహాలు, వాణిజ్య సముదాయాలు యజమానుల కోసం ఎదురుచూస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 2 శాతం అధికం. 2015-16 తొలి త్రైమాసికంలో అమ్ముడుకాని ఆస్తుల మొత్తం 15 శాతంగా ఉండగా, ఇప్పుడది 17 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఢిల్లీ - ఎన్సీఆర్ పరిధిలో ఈ తరహా నిర్మాణాలు అధికంగా కనిపిస్తున్నాయి. నిర్మాణ రంగంలో నెలకొన్న అనిశ్చితి తొలగకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

More Telugu News