: కలియుగంలో రజనీకాంత్ దుర్యోధనుడు, నేను కర్ణుడిని: సినీ నటుడు మోహన్ బాబు

తమిళసూపర్ స్టార్ రజనీకాంత్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు చిరకాల మిత్రులు. ఆ చిరకాల మిత్రులు ఇటీవల కలిసిన సందర్భం గురించి మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.‘నా బెస్ట్ ఫ్రెండ్ ను కలిశాను. కింగ్ లా ఉన్నాడు! ఈ కలియుగంలో అతను దుర్యోధనుడు, నేను కర్ణుడు’ని అంటూ ఆ ట్వీట్ లో తమ స్నేహబంధం గురించి గొప్పగా మోహన్ బాబు చెప్పుకున్నారు. అంతేకాకుండా, ‘చాలా కాలం తర్వాత చెల్లెలు లతను కలిశాను. రజనీకాంత్ విజయం వెనుక ఆమె కూడా ఉందని నేను బలంగా నమ్ముతాను’ అంటూ మరో ట్వీట్ లో మోహన్ బాబు పేర్కొన్నారు. రజనీ, మోహన్ బాబు ఆప్యాయంగా ఉన్న ఫొటోలతో పాటు, రజనీ భార్య లత, తనకు రాఖీ కడుతున్న మరో ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.

More Telugu News