: పేదలు ‘ఆటా’ తింటారా? ‘డేటా’ తింటారా?: మోదీపై లాలూ సెటైర్లు

ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దీనికి నేపథ్యం జియో సంస్థ యాడ్స్ లో పీఎం మోదీ ఫొటోలుండటమే! ‘జియో డిజిటల్ లైఫ్’ ప్రకటనలకు సంబంధించి ఇచ్చిన ఫుల్ పేజ్ పత్రికా ప్రకటనల్లో పీఎం నరేంద్ర మోదీ బొమ్మ ఉండటంపై లాలూ విమర్శల వర్షం కురిపించారు. ఈమేరకు లాలూ తన ట్విట్టర్ ఖాతాలో హిందీలో ఒక పోస్ట్ చేశారు. ‘పేద ప్రజలు ఏం తింటారు: ఆటా (గోధుమ పిండి) లేదా డేటా? చౌకగా లభించేంది డేటా, ఎక్కువ ధరకు లభించేది ఆటా. దేశాన్ని మారుస్తామనడానికి వాళ్లు ఇస్తున్న నిర్వచనం ఇదే....’ అంటూ ఆ ట్వీట్ లో లాలూ ఎద్దేవా చేశారు. కాగా, ప్రధాని మోదీని ‘మిస్టర్ రిలయన్స్’ అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిన్న విమర్శించారు. ‘రిలయన్స్’ కు మోడలింగ్ చేసుకోవాలంటూ మోదీపై కొంచెం ఘాటు వ్యాఖ్యలే కేజ్రీ చేశారు. ‘జియో డిజిటల్ లైఫ్’ ప్రకటనలకు మోదీ ఫొటోను ఉపయోగించిన సదరు సంస్థ పీఎంఓ అనుమతి తీసుకుందా? అని కాంగ్రెస్ పార్టీ నాయకులూ ప్రశ్నించారు. లేనిపక్షంలో ‘జియో డిజిటల్ లైఫ్’పై చట్టపరంగా చర్యలకు దిగుతామని హెచ్చరించారు.

More Telugu News