: హీరో అక్షయ్ కుమార్ చేతి కట్టు... గాయమైందనుకుని అభిమానుల ఆందోళన!

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చేతికి గాయమైందనుకుని ఆయన అభిమానులు ఆందోళన చెందారు. అక్షయ్ తాజాగా నటిస్తున్న ‘జాలీ ఎల్ఎల్ బీ-2’ చిత్రం నిర్మాణంలో వుంది. లక్నోలో ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ పూర్తయిందని తెలుపుతూ అక్షయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫొటో పోస్ట్ చేశాడు. అక్కడి సెట్ లో దిగిన ఈ ఫొటోలో అక్షయ్ కుమార్ చేతికి కట్టు ఉంది. తమ అభిమాని చేతికి కట్టు ఉండటంతో కంగారు పడిన ఆయన అభిమానులు సామాజికమాధ్యమాల ద్వారా పలు ప్రశ్నలు సంధించారు. వెంటనే స్పందించిన అక్షయ్, తాను బాగానే ఉన్నానని, ఆ కట్టు షూటింగ్ లో భాగమని పేర్కొన్నాడు. తాను చాలా ఫిట్ గా ఉన్నానని తెలియజెప్పే ఒక వీడియోను కూడా అక్షయ్ పోస్ట్ చేశాడు. దీంతో, అభిమానులు ‘హమ్మయ్య’ అనుకున్నారు. కాగా, సుభాష్ కపూర్ 2013లో తెరకెక్కించిన ‘జాలీ ఎల్ఎల్ బీ’ చిత్రానికి సీక్వెల్ గా ‘జాలీ ఎల్ఎల్ బీ-2’ ను రూపొందిస్తున్నారు.

More Telugu News