: బ్రిటిష్ మీడియా, యూఎస్ బ్లాగ్ లపై పరువునష్టం దావా వేసిన ట్రంప్ భార్య

బ్రిటిష్ పత్రిక డెయిలీ మెయిల్, యూఎస్ వెబ్ సైట్ లపై అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ పరువునష్టం దావా వేశారు. ట్రంప్ కు భార్య కావడానికి ముందు తాను గడిపిన జీవితం గురించి తప్పుగా ప్రచురించడమే కాకుండా, ఆక్షేపణీయమైన వ్యాఖ్యలు చేస్తూ ‘డెయిలీ మెయిల్’ ప్రచురించిందని మెలానియా తరపు లాయర్ పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన ఆమె ఆ పత్రికపై 150 మిలియన్ డాలర్లకు పరువు నష్టం దావా వేసినట్లు చెప్పారు. మేరీ లాండ్ కోర్టులో ఈ దావా వేశారన్నారు. మీడియా, బ్లాగ్ లలో ఆమెపై వచ్చిన కథనాలు, వ్యాఖ్యలు మెలానియా వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన గౌరవానికి భంగం కల్గించే విధంగా ఉన్నాయన్నారు. కాగా, కోర్టులో పరువు నష్టం దావా వేసిన అనంతరం డెయిలీ మెయిల్, యూఎస్ వెబ్ సైట్ క్షమాపణలు చెప్పడమే కాకుండా, ఆ కథనాలను తొలగించాయి.

More Telugu News