: మన విద్యావిధానంలోనే లోపం ఉంది: గవర్నర్ నరసింహన్

మన విద్యావిధానంలోనే లోపం ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ అన్నారు. హైదరాబాదులో 'తెలంగాణ జాగృతి' నిర్వహించిన స్కిల్ డెవలెప్ మెంట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని సూచించారు. నైపుణ్య శిక్షణ విద్యలో ఒక భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. కేవలం విద్యనభ్యసించినందువల్లే ఉద్యోగాలు రావని ఆయన సూచించారు. నైపుణ్యం లేకపోతే ఉద్యోగాలు రావని, అందుకే ఈ దిశగా సమాజంలో చైతన్యం రావాలని ఆయన చెప్పారు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసినవారు కూడా అటెండర్లుగా పనిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థంతో విద్యను వ్యాపారం చేశారని ఆయన విమర్శించారు. సరస్వతిదేవిని లక్ష్మీదేవిగా మార్చారని పేర్కొన్న ఆయన, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పై మన వ్యవస్థ విఫలమైందని ఆయన విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు నెలకొల్పి, గ్రామీణ విద్యార్థుల్లో స్కిల్ డెవలప్ చేయాలని ఆయన సూచించారు.

More Telugu News