: ఇంత పెద్ద సమ్మెను ఎన్నడూ చూడలేదు, ప్రభుత్వం దిగిరావాల్సిందే: కోదండరామ్

తామెదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా 18 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం కార్మిక ఐక్యతకు నిదర్శనమని, ఈ ఒత్తిడికి ప్రభుత్వాలు దిగి రావాల్సిందేనని జేఏసీ చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద సమ్మె విజయవంతంగా జరుగుతుండటాన్ని తానెన్నడూ చూడలేదని తెలిపారు. ఈ ఉదయం సమ్మెపై స్పందించిన ఆయన, ఐటీ రంగానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వాలు, మిగతా రంగాలను విస్మరించాయని, ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటు సంస్థలకు దోచి పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు కూడా అందించడం లేదని, కొత్తగా ఉద్యోగాలను ఇవ్వడం లేదని అన్నారు. సమ్మెలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ తమ మద్దతు ఉంటుందని వివరించారు.

More Telugu News