: ముస్లింల వస్త్రధారణపై ఫ్రెంచ్ మేయర్ సంచలన వ్యాఖ్యలు

ఫ్రాన్స్ లో ఉగ్రదాడులు జరిగిన అనంతరం అక్కడ ముస్లింల వస్త్రధారణపై ఆయా నగరాల మేయర్లు కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. అందులో భాగంగా బుర్ఖినీలను నిషేధిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అక్కడి మంత్రులు, న్యాయస్థానాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ మేయర్లు తమ నిర్ణయం వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో కోగోలిన్ కొమునే మేయర్ మార్క్ ఎటీనే లాన్సేడ్ మాట్లాడుతూ, తాము చెప్పినట్టు మసలుకోకపోతే అక్కడికి రావద్దని ముస్లింలకు స్పష్టం చేశారు. అలాకాదు, ఫ్రాన్స్ వచ్చినా బుర్ఖినీలు ధరస్తామంటే మాత్రం కుదరదని ఆయన అన్నారు. స్థానికులతోపాటు టూరిస్టులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రోమ్‌ లో ఉన్నప్పుడు రోమన్‌ లానే ఉండాలని ఆయన తెలిపారు. అలా కాదని ఆదేశాలు ధిక్కరించేవారంతా ఓసారి సౌదీ అరేబియా వెళ్లి, 'ఫ్రాన్స్ లో ఇలా ఉంటాము' అని చెప్పి బీచ్ లో నగ్నంగా కాసేపు తిరిగి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి అని సూచించారు. ఎవరైనా సరే ఏ దేశం వెళ్తే ఆ దేశ నిబంధనలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News