: ప్రత్యేకహోదా, నిధులపై రెండుమూడ్రోజుల్లో స్పష్టత వస్తుంది: సుజనా చౌదరి

ఏపీకి ప్రత్యేకహోదా, నిధులపై రెండుమూడ్రోజుల్లో స్పష్టత వస్తుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ప్రత్యేక హోదా కింద ఇచ్చే రాయితీల కన్నా, ఎక్కువ రాయితీలను కేంద్రం ఇస్తామందన్నారు. తాము గుడ్డిగా వాదించమని, రాష్ట్రానికి మంచి జరిగే వరకు పోరాడతామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే దాని వల్ల ఎంత లాభం చేకూరుతుందో కేంద్రం లెక్కిస్తుందన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరామని, జీఎస్టీ వచ్చిన తర్వాత ప్రత్యేక పన్ను మినహాయింపుకు వీలు కావట్లేదన్నారు. ప్రత్యేక పన్ను మినహాయింపునకు రాష్ట్రానికి కొంత నిధి ఇస్తామంటున్నారన్నారు. జాతీయ ప్రాజెక్టులన్నింటికీ నాబార్డు ద్వారా ఓ నిధి ఏర్పాటు చేశారన్నారు. ప్రయత్నలోపం లేకుండా టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి విపక్షాలు సహకరించాలని ఈ సందర్భంగా సుజనా చౌదరి కోరారు.

More Telugu News