: భారత డీటీహెచ్ ప్రసారాలపై నిషేధం విధిస్తున్నాం: పాకిస్థాన్‌

భారత డీటీహెచ్ ప్రసారాలపై త‌మ దేశంలో నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్‌ పీఈఎమ్ఆర్ఏ ఛైర్మన్ అబ్సర్ అలం పేర్కొన్నారు. వాటి ప్రసారానికి త‌మ దేశంలో అనుమతులు లేవని చెప్పారు. నిషేధం అంశంపై తాము ఇప్ప‌టికే ఎఫ్ఐఏ, ఎఫ్ బీఆర్, స్టేట్ బ్యాంకు ఏజెన్సీలకు లేఖ కూడా పంపిన‌ట్లు తెలిపారు. విదేశీ చానెళ్ల ప్రసారాలపై ఆ దేశ ప్రభుత్వం త్వరలో ఆంక్షలు తీసుకురానున్న నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని మీడియాకు తెలిపారు. త్వ‌ర‌లోనే పాకిస్థానీ డీటీహెచ్ సేవ‌లు అందుబాటులోకి రానున్న నేప‌థ్యంలో ఆ దేశ‌ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరి అథారిటీ(పీఈఎమ్ఆర్ఏ) త‌మ దేశంలోని విదేశీ ఛానెళ్ల‌ను మూసివేయాల‌ని చెప్పింది. దీని కోసం కేబుల్ ఆపరేటర్లు, శాటిలైట్ ఛానెళ్లకు వ‌చ్చే నెల 15 వ‌ర‌కు స‌మ‌యాన్ని కూడా ఇస్తున్న‌ట్లు తెలిపింది. త‌మ ఆదేశాల‌ను లెక్క‌చేయ‌ని వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఒక్క‌రోజులో రెండు గంటల న‌ల‌బై నిమిషాలు మాత్రమే విదేశీ ప్రసారాలను ప్రసారం చేస్తారని పాకిస్థాన్‌ పీఈఎమ్ఆర్ఏ ఛైర్మన్ మీడియాకు తెలిపారు.

More Telugu News