: జీఎస్టీకి 15 రాష్ట్రాలు ఓకే!... మరో రాష్ట్రం సరేనంటే చట్టంగా మారనున్న కొత్త పన్ను!

చాలాకాలంగా చట్టంగా మారేందుకు ఎదురుచూస్తున్న జీఎస్టీ బిల్లు... అందుకు అడుగు దూరంలో నిలిచింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) పేరిట రూపొందిన ఈ బిల్లుకు పార్లమెంటు ఇప్పటికే ఓకే చెప్పేసింది. ఇక దేశంలోని మెజారిటీ (సగానికంటే ఎక్కువ సంఖ్య) రాష్ట్రాలు ఓకే అంటే అది చట్టంగా మారిపోతుంది. ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరగా... ఇప్పటిదాకా 15 రాష్ట్రాలు అందుకు సానుకూలంగానే స్పందించాయి. మరొక్క రాష్ట్రం ఓటేస్తే... జీఎస్టీ బిల్లు చట్టంగా మారబోతోంది. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలుండగా, ఇప్పటిదాకా 15 రాష్ట్రాలు జీఎస్టీకి సమ్మతి తెలిపాయి. 29 రాష్ట్రాల్లో 15 అంటే సగం కంటే అధికమైనప్పటికీ, సంఖ్యాపరంగా ఇంకో రాష్ట్రం ఓటు అవసరమైంది. ఈ నేపథ్యంలో ఇంకో రాష్ట్రం నుంచి సానుకూల స్పందన రాగానే రాష్ట్రపతి ఈ బిల్లును చట్టంగా మారుస్తూ సంతకం చేయనున్నారు.

More Telugu News