: రాబర్ట్ వాద్రా అక్రమాలు నిజమేనట!... తేల్చిచెప్పిన ధింగ్రా కమిటీ!

తన అత్త సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ సర్కారు దేశాన్ని పాలిస్తున్న సందర్భాన్ని ఆసరా చేసుకుని దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని హర్యానాలో పెద్ద ఎత్తున భూములను పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా అక్రమాలకు పాల్పడ్డారట. ఈ మేరకు వాద్రా భూముల కొనుగోలు, ఆ తర్వాత అదే భూములతో ఆయన చేసిన వ్యాపారాల్లో అక్రమాలేమైనా ఉన్నాయా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు ఏర్పాటైన ధింగ్రా కమిటీ నిన్న తన నివేదికను హర్యానా ప్రభుత్వానికి అందజేసింది. వాద్రా అక్రమాలకు పాల్పడ్డట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయని ఈ సందర్భంగా జస్టిస్ ధింగ్రా నిన్న మీడియాకు వెల్లడించారు. దాదాపు 182 పేజీలతో కూడిన సుదీర్ఘ నివేదికను ఆయన హర్యానా సర్కారు చేతిలో పెట్టారు. ఈ నివేదిక నిన్న దేశ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. వాద్రాపై అపనిందలు వేసేందుకు బీజేపీ సర్కారు యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ నిరసన గళం విప్పగా... రాజకీయ విద్వేషం కాంగ్రెస్ గుత్త సొత్తు అని బీజేపీ ప్రతిస్పందించింది.

More Telugu News