: 18 బంతుల్లో 55 పరుగులు చేసిన ఫించ్... జోరు మీదున్న ఆస్ట్రేలియా

శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ విరుచుకుపడ్డాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 212 పరుగులకు ఆలౌట్ అయింది. లంకేయుల్లో ఓపెనర్ డిసిల్వా (76), కెప్టెన్ మాథ్యూస్ (34) రాణించగా, బౌలర్ పతిరన (24) ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ వరద పారిస్తున్నారు. ఆరోన్ ఫించ్ కేవలం 18 బంతుల్లోనే 304 స్ట్రయిక్ రేట్ తో 55 పరుగులు చేసి లంక బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో జార్జ్ బెయిలీ (56) హెడ్ (30) క్రీజులో ఉన్నారు. విజయానికి 28 ఓవర్లలో 44 పరుగులు చేయాల్సి ఉంది. 22 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 169 పరుగులు చేసింది.

More Telugu News