: మోదీతో భేటీ తరువాత మ‌రోసారి అమిత్ షా, జైట్లీల‌తో వెంక‌య్య‌ భేటీ.. ఏపీకి ‘హోదా’పై తుదినిర్ణయం వ‌చ్చే అవ‌కాశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాపై ఢిల్లీలో క్షేత్ర‌స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల అమ‌లుపై నిన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈరోజు వెంక‌య్య‌ ప్ర‌ధాని మోదీతో కూడా హోదా అంశంపై చ‌ర్చ‌లు జ‌రిపారు. హామీల అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. అనంత‌రం మరోసారి అమిత్ షా, జైట్లీతో ఇదే అంశంపై స‌మావేశమ‌య్యారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేంద్రానికి విన్న‌వించుకున్న అంశాలు, సుజ‌నా చౌద‌రి త‌యారు చేసిన ముసాయిదా నివేదిక‌పై వారితో వెంక‌య్య స‌మ‌గ్రంగా చ‌ర్చించారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా లేదా ప్ర‌త్యేక ప్యాకేజీపై వారం రోజుల్లో తుది నిర్ణయం వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

More Telugu News