: జకీర్ నాయక్ పై బిగుస్తున్న ఉచ్చు

ప్రముఖ ఇస్లాం మత బోధకుడు జకీర్‌ నాయక్‌ ను అరెస్టు చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. టెర్రరిస్టు వ్యతిరేక చట్టం కింద జకీర్ నాయక్, ఆయన నడిపిస్తున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పైన కేసు పెట్టాలని సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్ కుమార్‌ కేంద్రానికి సూచించినట్టు తెలుస్తోంది. నాయక్‌ సిద్దాంతాలు, ప్రసంగాలు సెక్యులర్ దేశమైన భారత్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, దేశ ప్రజలను మతాల వారీగా విభజించే విధంగా ఉన్నాయని సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయపడ్డారు. కాగా, బంగ్లాదేశ్ లో బేకరీపై దాడికి దిగిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల్లో పట్టుబడ్డ వ్యక్తి తాను జకీర్‌ నాయక్ ప్రసంగాల స్ఫూర్తితోనే దాడులకు పాల్పడినట్లు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జకీర్ నాయక్ కు చెందిన పీస్ టీవీ ఛానెల్ ను బంగ్లాదేశ్ లో నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో మతానికి ముడిపడిన ఈ అంశంపై సలహా ఇవ్వాలంటూ కేంద్రం సొలిసిటర్‌ జనరల్‌ ను కోరింది. దీంతో ఆయన సూచించిన విధంగా చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

More Telugu News