: నవ్యాంధ్రకు మణిహారం... నాలుగేళ్లలో విజయవాడ మెట్రో పూర్తి, డీఎంఆర్సీ తో కుదిరిన డీల్

నవ్యాంధ్రకు మణిహారమైన విజయవాడ మెట్రో కార్యరూపం దాల్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు, డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా వచ్చే నాలుగేళ్లలో రెండు కారిడార్లను పూర్తి చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు జైకా నుంచి రుణం తీసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. జైకా విధిస్తున్న నిబంధనలతో మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగేలా కనిపించడం లేదని అభిప్రాయపడ్డ మెట్రో రైల్ ఎండీ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 300 కోట్లతో పనులను ప్రారంభించనున్నామని, బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. డీల్ పై సంతకాల తరువాత ఆయన మాట్లాడుతూ, రూ. 300 కోట్లతో భూసేకరణ పనులు ప్రారంభిస్తామని, ఆపై డీఎంఆర్సీ పని మొదలవుతుందని వివరించారు. త్వరలోనే మెట్రో ప్రాజెక్టుకు కొత్త టెండర్లను కూడా పిలవనున్నామని రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

More Telugu News