: పైనున్న నాగార్జున సాగర్ ఖాళీ... కిందున్న పులిచింతల నిండుకుండ!

గుంటూరు జిల్లా మాచర్ల, దాచేపల్లి, గురజాల ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో కురుస్తున్న వర్షానికి చంద్రవంక నదితో పాటు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా, ఆ నీరంతా పులిచింతల డ్యామ్ వద్దకు చేరుతోంది. కృష్ణానదిలో ఎగువ నుంచి వరద ప్రవాహం లేక నాగార్జున సాగర్ డ్యామ్ బోసిపోయి కనిపిస్తుండగా, కిందున్న పులిచింతల వద్ద ఈ మధ్యాహ్నం 70 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. గంటల వ్యవధిలో ఒకటిన్నర టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సూచించారు. జలాశయం వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆయన ఆదేశించారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున రెవెన్యూ, పోలీసు సిబ్బంది తగు జాగ్రత్తల్లో ఉండాలని తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రాజెక్టు వద్దకు జల వనరుల శాఖ అధికారులు చేరుకున్నారు.

More Telugu News