: స్కార్పీన్ సబ్ మెరైన్ గురించి ఒక్క మాట కూడా రాయవద్దు... ఆస్ట్రేలియన్ పత్రికకు కోర్టు ఆదేశం

భారత స్కార్పీన్ సబ్ మెరైన్ల గురించి మరే విధమైన సమాచారాన్నీ ప్రచురించవద్దని 'ది ఆస్ట్రేలియన్' పత్రికకు అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ జలాంతర్గామికి సంబంధించిన రహస్య సమాచారం బయటకు పొక్కగా, దాన్ని సేకరించిన పత్రిక వివరాలను ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని తయారు చేస్తున్న ఫ్రెంచ్ రక్షణ సంస్థ డీసీఎన్ఎస్, మరిన్ని వివరాలు వెల్లడించకుండా 'ది ఆస్ట్రేలియన్'ను నిలువరించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, వాదనలు విన్న ఆస్ట్రేలియా న్యాయస్థానం తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. సబ్ మెరైన్ కు చెందిన ఆయుధ వ్యవస్థ, రాడార్ల పనితీరు తదితర వివరాల గురించి ఆన్ లైన్లో పెట్టిన సమాచారాన్ని వెంటనే తొలగించాలని ఆదేశించింది. మొత్తం 22 వేల పేజీల రహస్య సమాచారం బయటకు వెళ్లిన ఉదంతం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

More Telugu News