: హెల్మెట్ లేకుండా వ్యాన్ ఎందుకు నడిపావంటూ డ్రైవర్ కు నోటీసు!

హెల్మెట్ లేకుండా వ్యాన్ నడిపావంటూ ఒక డ్రైవర్ కు నోటీసులిచ్చిన ఆశ్చర్యకర సంఘటన చెన్నైలోని కరూర్ జిల్లాలో జరిగింది. ఆ జిల్లాలోని గాంధీ గ్రామానికి చెందిన ముత్తు సెల్వమ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం సరుకుల లోడ్ ఉన్న మినీ వ్యాన్ తో దిండుగల్ జిల్లాలోని ఏరియోడుకు వెళ్లాడు. సరుకులు అన్ లోడ్ చేసిన అనంతరం తిరిగి వస్తున్న సందర్భంలో వేడచందూరు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ముత్తు సెల్వమ్ వ్యాన్ ను కూడా ఆపారు. హెల్మెట్ లేకుండా వ్యాన్ ఎందుకు నడుపుతున్నావంటూ అతనికి నోటీస్ జారీ చేశారు. ద్విచక్ర వాహనచోదకులకు హెల్మెట్ తప్పనిసరనే నిబంధన ఉంది కానీ, వ్యాన్ డ్రైవర్లకు ఈ నిబంధన ఎందుకు వర్తిస్తుందబ్బా? అంటూ సదరు డ్రైవర్ తో పాటు మిగిలిన వాహన చోదకులు విస్తుపోయారు. అయితే, ఈ నోటీస్ పేపర్ సామాజిక మాధ్యమాల్లో చేరి .. వైరల్ గా మారింది. సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్ల నుంచి డిమాండ్లు హోరెత్తాయి.

More Telugu News