: స్వాతంత్ర్యం కావాలంటూ పాకిస్థాన్ 'సింధ్' ప్రాంతంలో ఆందోళనలు

కాశ్మీర్ కి స్వాతంత్ర్యం వచ్చే వరకు పోరాడుతామని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ ముహూర్తాన ఉగ్రవాదులతో కలిపి ప్రకటించాడో ఆ రోజే పాకిస్థాన్ పతనానికి ముహూర్తం ఖరారైంది. నవాజ్ షరీఫ్ ప్రకటించిన తరువాత భారత్ లో ఆయన వ్యాఖ్యలను ఆర్మీ అధికారులు తీవ్ర స్థాయిలో ఖండించారు. రాజకీయ నాయకులు పెద్దగా స్పందించలేదు. ఆ తరువాత పాక్ లో హోం మంత్రి రాజ్ నాథ్ పర్యటించి, ఆ దేశానికే సవాలు విసిరితే, ఆగస్టు 15న భారత స్వాతంత్ర్యదినోత్సవం రోజున ఎర్రకోట సాక్షిగా ప్రధాని బలూచిస్ధాన్ కు మద్దతు పలికారు. దీంతో బలూచిస్థాన్ ప్రజలు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఆందోళనలు రాజుకున్నాయి. ఇవి లండన్ లో చైనా ఎంబసీ ముందు ఆ దేశ పౌరులు ఆందోళన చేసే వరకు వెళ్లాయి. ఇంతలో పీవోకే ప్రజలు మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమకు స్వాతంత్ర్యం (ఆజాదీ) కావాలంటూ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. దీంతో ఇవి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), గిల్గిత్‌-బాల్టిస్తాన్, బలూచిస్తాన్‌ లకు పాకాయి. తాజాగా ఈ ఆందోళనలు సింధ్ ప్రావిన్స్‌ కు కూడా పాకాయి. ఈ ఐదు ప్రాంతాలలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆజాదీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బ్యానర్లు, జెండాలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ నినాదాలతో ఆందోళనలు చేస్తున్నారు. ఒకేసారి ఇన్ని ప్రాంతాలు పాకిస్థాన్ నుంచి విడిపోవాలని ఆందోళనలు చేపట్టడంతో పాక్ నేతలు తలలు పట్టుకున్నారు. ఒక్క కాశ్మీర్ కోసం మాట్లాడితే...పరిణామాలు ఇంత తీవ్ర స్థాయిలో ఉంటాయా? అని ఆశ్చర్యపోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం నుంచి పీఓకే, గిల్జిత్, బలూచిస్తాన్ లలోని ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష మరింత పెల్లుబుకుతోంది. అమెరికా సైతం పాక్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్ రాష్ట్రాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళనలు వ్యక్తం చేసింది.

More Telugu News