: రూ.200 కోట్ల ‘ప్రైడ్ ఇండియా’ వెంచర్ వెనుక నయీమ్ హస్తం

గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమైన తర్వాత అతని ఆస్తులు, దందాలు, సెటిల్ మెంట్లకు సంబంధించి నోరెళ్లబెట్టే విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ శివార్లలోని ప్రైడ్ ఇండియా గ్రూప్ కు సంబంధించిన ఒక వెంచర్ వ్యవహారంలో నయీమ్ హస్తం ఉన్నట్లు సిట్ కు ఫిర్యాదు అందింది. రూ.200 కోట్ల విలువైన ఈ వెంచర్ కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్కడి దేవతల గుట్టమీద ఉన్న దేవాలయాన్ని కూల్చివేశారని స్థానికులు కొన్నాళ్లుగా ఆందోళనలకు దిగారు. తిరిగి ఆలయం నిర్మించాలంటూ వారు ఉద్యమిస్తున్నారు. ఈ విషయమై స్థానికులకు అండగా ఉన్న బీజేపీ నేత శంకర్ రెడ్డిని నయీమ్ అనుచరులు గతంలో బెదిరించారు. ఈ సంఘటనపై ఆయన ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయాలంటూ పహడీషరీఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ను సైబరాబాద్ కమిషనర్ నాడు ఆదేశించారు. ఈ సంఘటనలో నయీమ్ పై కేసు నమోదు కాకపోగా, ఆ ఫిర్యాదే మాయమైపోయింది. కాగా, నయీమ్ బాటలోనే ‘ప్రైడ్ ఇండియా’ మేనేజింగ్ డైరెక్టర్ సనోవర్ బేగ్ నడిచేవాడని స్థానికులు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు విచారణ కూడా చేశారు. అయితే, ‘ప్రైడ్ ఇండియా’ అక్రమాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని బాలాపూర్ గ్రామస్తులు వాపోతున్నారు.

More Telugu News