: ‘పోకెమాన్’ ప్రత్యేక బర్గర్లు... ఎగబడుతున్న వినియోగదారులు!

స్మార్ట్ ఫోన్ గేమ్ అయిన ‘పోకెమాన్’ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాల్లో అధికారికంగా ఈ గేమ్ ను విడుదల చేయకపోయినప్పటికీ ఏదోఒక విధంగా ఆడేస్తున్నారంటే దీని ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ గేమ్ లోని క్యారెక్టర్ల పేరిట బర్గర్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ‘డౌన్ ఎన్’ రెస్టారెంట్ లో ‘పోకెమాన్’ పేరుతో ప్రత్యేకంగా బర్గర్లు తయారు చేస్తోంది. ఆ గేమ్ లోని క్యారెక్టర్లు యెల్లో పికాచు, పింక్ చార్మండర్, గ్రీన్ బల్బాసార్ పేర్లతో ఈ బర్గర్లను సదరు రెస్టారెంట్ తయారు చేస్తోంది. దీంతో, ఈ బర్గర్ల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. అయితే, మనకు నచ్చిన బర్గర్ ను ఆర్డర్ చేసే అవకాశం మాత్రం లేదు. రెస్టారెంట్ మూడు రకాల పేర్లతో తయారు చేస్తున్న బర్గర్లలో వరుస క్రమంలో ఏదొస్తే అది వినియోగదారుడు తీసుకోవాల్సిందే. వినియోగ దారులు ఎగబడుతున్నారు కదా అని చెప్పి, విచ్చలవిడిగా మాత్రం ‘పోకెమాన్’ బర్గర్లను ‘డౌన్ ఎన్’ తయారు చేయట్లేదు. రోజుకు వంద మాత్రమే తయారుచేస్తుండటం గమనార్హం.

More Telugu News