: కథ మొదటికి!... 'మాకీ' డిజైన్లను తిరస్కరించిన ఏపీ సీఆర్డీఏ!

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలు మరింత ఆలస్యం కానున్నాయి. అమరావతి పరిధిలో అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయ భవనాలకు సంబంధించి జపాన్ సంస్థ ‘మాకీ’ రూపొందించిన డిజైన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ మేరకు నిన్న ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ సిద్ధం చేసిన తర్వాత ప్రధాన నిర్మాణాలకు సంబంధించి సీఆర్డీఏ జారీ చేసిన నోటిఫికేషన్ కు స్పందించిన జపాన్ సంస్థ మాకీతో పాటు పలు దేశీయ సంస్థలు కూడా పలు డిజైన్లను అందజేశాయి. వీటిని పరిశీలించిన సీఆర్డీఏ... మాకీ డిజైన్ల పట్ల మొగ్గుచూపింది. అయితే సదరు డిజైన్లలో విద్యుత్ చిమ్నీ లాంటి ఆకారాలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ డిజైన్లను తిరస్కరిస్తూ నిన్న సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పలు దేశాల్లో పర్యటించనున్న సీఆర్డీఏ బృందం మరోమారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. వెరసి అమరావతిలో ప్రధాన నిర్మాణాలు మరింత ఆలస్యం కానున్నాయి.

More Telugu News